Skip to main content

Namaste NRI

అమ్మవారి అవతారంలో లయ .. సన్ ఆఫ్ కనకదుర్గమ్మ పోస్టర్‌ను విడుదల చేసిన అశ్వనీదత్, స్వప్న దత్

నిధి అన్వేషణ ప్రధాన ఇతివృత్తంగా రూపొందిస్తున్న చిత్రం సన్‌ ఆఫ్‌ కనకదుర్గమ్మ. లయ, అనురూప్‌ కటారి, ఆకాంక్ష త్యాగరాజన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి దుర్గ ఫణిందర్‌ దర్శకుడు. దసరా సందర్భంగా ఈ సినిమా స్పెషల్‌ పోస్టర్‌ను ప్రముఖ నిర్మాతలు అశ్వనీదత్‌, స్వప్నదత్‌ విడుదల చేశారు. ఇందులో నటి లయ అమ్మవారి అవతారంలో శక్తివంతంగా కనిపిస్తున్నారు.

నిధి అన్వేషణ నేపథ్యంలో సాగే ఈ కథలో విజువల్స్‌, యాక్షన్‌ ఘట్టాలు ప్రత్యేకాకర్షణగా నిలుస్తాయని, దుష్టశిక్షణ గావించే అమ్మవారి అవతారంలో లయ కనిపించే సన్నివేశాలు ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని అందిస్తాయని చిత్రబృందం పేర్కొన్నది. ఈ చిత్రానికి సంగీతం: శశిధర్‌ లంక, కథ: కాకర్ల గోవర్ధన రావు, నిర్మాతలు: వాణి శంకర్‌, తిలోత్తమ, దర్శకత్వం: దుర్గ ఫణిందర్‌ లంక.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events