డొనాల్డ్ ట్రంప్ రెండో దఫా పాలనలో 3 లక్షల యూఎస్ వీసాలను రద్దు చేసినట్టు ఆయన అధికార యంత్రాంగం మంగళవారం తెలిపింది. వలసలపై కఠిన విధానం కొనసాగిస్తామని స్టేట్ డిపార్ట్‌మెంట్ స్పష్టం చేసింది. కొన్ని నెలలుగా వీసాల రద్దు వేగవంతమైనట్టు వాటి సంఖ్య సూచిస్తున్నది.

దేశ భద్రతను మెరుగు పరచడమే లక్ష్యంగా వలసదారుల అణచివేత, బహిష్కరణను కొనసాగిస్తున్నామని ట్రంప్ చెప్తుండగా, ఈ అణచివేత చట్టబద్ధ ప్రక్రియను, భావ ప్రకటన స్వేచ్ఛ హక్కులను ఉల్లంఘించిందని, మైనారిటీల్లో అభదత్రను కలిగించిందని హక్కుల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన పాలస్తీనా అనుకూలురైన వారివీసాలను ఎక్కువగా రద్దు చేశారని వారు ఆరోపించారు.















