Skip to main content

Namaste NRI

శాంతి చర్చలకు పుతిన్‌ అంగీకారం.. త్వరలో ముగింపు?

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి ముగింపు పలికే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్‌, అమెరికాతో కలిసి త్రైపాక్షిక శాంతి చర్చలు జరిపేందుకు రష్యా అంగీకరించినట్టు తెలిసింది. ఈ చర్చల్లో చైనా కూడా కీలకపాత్ర పోషించే అవకాశం ఉందని క్రెమ్లిన్‌ సంకేతాలిచ్చింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రత్యేక రాయబారి స్టీవ్‌ విట్కాఫ్‌ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో సమావేశమయ్యారు. దాదాపు మూడు గంటలపాటు జరిగిన ఈ భేటీలో ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ముగించే ప్రతిపాదనలు, తదుపరి చర్చలపై ప్రధానంగా చర్చించినట్టు సమాచారం. పుతిన్‌తో సమావేశం అనంతరం రష్యా అధ్యక్షుడి విదేశాంగ సలహాదారు యూరీ ఉషాకోవ్‌ మాట్లాడుతూ నవంబర్‌ 10 తర్వాత శాంతి చర్చలను కొనసాగించేందుకు పుతిన్‌ సూత్రప్రాయంగా అంగీకరించినట్టు చెప్పారు. అబుదాబిలో ఈ త్రైపాక్షిక చర్చలు జరిగే అవకాశం ఉందని క్రెమ్లిన్‌ వెల్లడించింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events