Skip to main content

Namaste NRI

ఇటలీ ప్రభుత్వం కొత్త నిబంధన!

ఇటలీలో నిరసనలు వెల్లువెత్తడంతో వాటిని అణచివేసేందుకు ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. అల్లర్లకు పాల్పడేవారికి శిక్షలు పెంచడంతోపాటు, మైనర్లుగా ఉన్న తమ పిల్లలు నిరసనల సమయంలో విధ్వంసం, దోపిడీలకు పాల్పడితే వారి తల్లిదండ్రులపైన ఆర్థిక బాధ్యత విధించే నిబంధనను తీసుకొచ్చింది. ఇటలీలోని ఉత్తర ప్రాంతాల్లో ముఖ్యంగా మిలాన్‌లో గత వారాంతంలో హింసాత్మక నిరసనలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఇటలీ ప్రభుత్వం కొత్త భద్రతా చర్యలకు ఆమోదం తెలిపింది.

నిరసనలు తెలపడం హక్కు కానీ నగరాలను తగులబెట్టడం హక్కు కాదు అని ప్రధాని మెలోనీ స్పష్టంచేశారు. కొత్త డిక్రీ వెంటనే అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం నిరసనల సమయంలో జరిగిన ఆస్తి నష్టానికి బాధ్యుల నుంచి పరిహారం వసూలు చేయవచ్చు. నష్టానికి కారణమైన వ్యక్తి మైనర్‌ అయితే, వారి తల్లిదండ్రులు ఆ పరిహారం చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events