Skip to main content

Namaste NRI

మేం సిద్ధంగా ఉన్నాం … నిర్మాతలకు ధైర్యం ఉందా? : కృతి సనన్‌

స్త్రీవాదాన్ని బలంగా వినిపించే బాలీవుడ్‌ కథానాయికల్లో కృతి సనన్‌ ముందు వరుసలో ఉంటుంది. సినీ పరిశ్రమలో స్త్రీలపై వివక్ష అనే అంశంపై ఆమె పలుమార్లు స్పందించారు కూడా. తాజాగా ప్రేక్షకులను థియేటర్లకు తెచ్చే సత్తా హీరోయిన్లకు కూడా ఉందని, కేవలం అగ్ర హీరోలతో మాత్రమే అధిక బడ్జెట్‌లు పెట్టి సినిమాలు తీసే సంస్కృతి నుంచి మేకర్స్‌ బయటకు రావాలని అన్నారు.

ఇటీవల ఓ వేడుకలో ఆమె మాట్లాడుతూ పఠాన్‌, ధురంధర్‌ లాంటి భారీ బడ్జెట్‌ యాక్షన్‌ సినిమాలను మహిళా ప్రధాన పాత్రలతో తెరకెక్కించినా జనం ఆదరిస్తారు. అలాంటి పాత్రల్ని చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం. తీయడానికి నిర్మాతలకు ధైర్యం ఉందా? అని కృతి సనన్‌ ప్రశ్నించారు. నిర్మాతలు ధైర్యం చేసి, తమ లాంటి హీరోయిన్లతో భారీ కమర్షియల్‌ సినిమాలు నిర్మించగలిగితే, వాటిని తమ భుజస్కంధాలపై విజయవంతంగా మోయగలిగే శక్తి తమకుందని కృతి సనన్‌ చెప్పారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events