Skip to main content

Namaste NRI

నిహారిక కొణిదెల పాకెట్ రాకెట్స్ టీజర్ విడుదల

నిహారిక కొణిదెల పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌, మాక్సిమం సిటీ స్టూడియోస్‌ కలిసి నిర్మిస్తున్న చిత్రం పాకెట్‌ రాకెట్స్‌. రుద్ర ఆత్రి దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి పద్మజ కొణిదెల, రాహుల్‌ రాఘవేంద్ర, రాహుల్‌ నిమ్మకూరి నిర్మాతలు. త్రినాథ్‌వర్మ, నిర్మల్‌, శ్రియా కొంతం ప్రధాన పాత్రధారులు. గ్యాంబ్లింగ్‌ చుట్టూ తిరిగే ఈ విభిన్న కథాచిత్రంలో జేడీ చక్రవర్తి కీలక పాత్రధారి. హైదరాబాద్‌లో ఈ సినిమా టీజర్‌ని మేకర్స్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రెస్‌మీట్‌లో నిహారిక కొణిదెల మాట్లాడుతూ జూలైలో సినిమా షూటింగ్‌ మొదలుపెట్టాం. ఆరునెలల్లో పూర్తి చేసి విడుదల చేస్తున్నాం. ఇక రిలీజ్‌ వరకూ మేమంతా మీ సోషల్‌ మీడియాలోకి, ఇంట్లోకి వచ్చేస్తాం అని తెలిపింది.

నిహారిక లాంటి గ్రేట్‌ ప్రొడ్యూసర్‌ని తాను ఇంతవరకూ చూడలేదని, రుద్ర ఈ సినిమాను ఎంత గొప్పగా తీశారో రేపు థియేటర్లలో చూస్తారని జేడీ చక్రవర్తి అన్నారు. టీమ్‌ ఇచ్చిన సహకారం వల్లే సినిమాను వేగంగా పూర్తి చేయగలిగానని దర్శకుడు రుద్ర అత్రి చెప్పారు. రెండు గంటల సేపు హాయిగా నవ్వించే సినిమా ఇదని నిర్మాత రాహుల్‌ రాఘవేంద్ర పేర్కొన్నారు. ఇంకా చిత్రబృందమంతా మాట్లాడారు. డిసెంబర్‌ 11న సినిమా థియేటర్లలోకి రానున్నది.ఈ చిత్రానికి కెమెరా: ఎదురోలు రాజు, సంగీతం: గ్యానీ.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events