పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి. వ్యూహాత్మకంగా కీలకమైన హొర్ముజ్ జలసంధిలో ఇరాన్‌కు చెందిన లక్ష్యాలపై అమెరికా దాడులు జరిపింది. ఈ విషయాన్ని అమెరికా అధికారి ఒకరు వెల్లడించారు. అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరుగుతున్న వేళ ఈ దాడులు చోటుచేసుకోవడం గమనార్హం. అయితే ఇవి పరిమిత స్థాయిలోనే జరిగిన సైనిక చర్యగా భావిస్తున్నారు. ఖేష్మ్, హెంగామ్ దీవులతోపాటు సమీపంలోని ప్రధాన భూభాగ ప్రాంతమైన బందర్ అబ్బాస్‌లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి.

గతంలో జరిగిన దాడుల మాదిరిగా ఈసారి అమెరికా ముందుగా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మధ్యంతర ఎన్నికలకు ముందు ఇరాన్‌పై దాడులు చేయబోమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గతంలో ప్రకటించారు. అయితే, ఇప్పుడు దాడులు జరగడం ఆయన వైఖరిలో మార్పునకు సంకేతంగా కనిపిస్తున్నది. ఇరాన్‌తో యుద్ధం, దాని ప్రభావంతో అమెరికాలో పెరిగిన పెట్రోల్ ధరలు, ఆర్థిక వ్యవస్థపై పడుతున్న భారం, కాంగ్రెస్‌పై పట్టు నిలుపుకోవాలని భావిస్తున్న ట్రంప్, రిపబ్లికన్ పార్టీకి ప్రతికూలంగా మారాయి.















