ఇరాన్‌కు చెందిన ఖాసిమ్ దీవి పై అమెరికా అటాక్ చేసినట్లు తెలిసింది. టెహ్రాన్‌తో శాంతి ప్రతిపాదన కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాల్లో ప్రగతి ఉన్నా, దాడులు జరిగినట్లు ఓ అధికారి చెప్పారు. హోర్ముజ్ జలసంధిలో ఉన్న అతిపెద్ద దీవి అది.అత్యంత రహస్యంగా దాడి ఆపరేషన్ చేపట్టినట్లు అమెరికా అధికారి వెల్లడించారు. ఖాసిం దీవిలో అయిదు ప్రదేశాల్లో పేలుళ్ల శబ్ధాలు వినిపించినట్లు తెలిసింది. రెండు విమానాలు గాలిలో ఎగురుతూ కనిపించినట్లు స్థానికులు చెప్పారు. తాజా దాడి గురించి అమెరికా సెంట్రల్ కమాండ్ ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే చాలా వారాల నుంచే స్వల్ప స్థాయిలో వైమానిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.

మరో వైపు అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరుగుతున్నాయి. మధ్యంత ఎన్నికల వేళ తాజా దాడి జరిగినట్లు భావిస్తున్నారు. అయితే టెహ్రాన్‌తో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు ఇటీవల ట్రంప్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఖాసిం దీవితో పాటు బందర్ లెంగే దీవిపై కూడా దాడి జరిగినట్లు చెబుతున్నారు.ఇటీవల అమెరికాకు చెందిన మూడు డ్రోన్లను హోర్ముజ్ సమీపంలో కూల్చినట్లు ఇరానీ రెవల్యూషనరీ గార్డు దళాలు పేర్కొన్న విషయం తెలిసిందే. దీంట్లో ఒకటి ఎంక్యూ-9 మిలిటరీ డ్రోన్ కూడా ఉన్నది.















