Skip to main content

Namaste NRI

అంతరిక్షం నుంచి ఓటేసిన వ్యోమగాములు.. ఎలా సాధ్యమైంది?

పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటు వేయ‌డం కాదు, నాసా ఆస్ట్రోనాట్లు భూమికి సుమారు 400 కిలోమీట‌ర్ల ఎత్తు నుంచి త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. అమెరికా మ‌ధ్యంత‌ర ఎన్నిక‌ల్లో ముగ్గురు వ్యోమ‌గాములు అంత‌ర్జాతీయ అంత‌రిక్ష కేంద్రం నుంచి త‌మ ఓటు వేశారు. మైక్రో గ్రావిటీలో ఓటేసిన తీరుపై భార‌త సంత‌తి ఆస్ట్రోనాట్ అనిల్ మీన‌న్ తెలిపారు. మీన‌న్‌తో పాటు మ‌రో ఇద్ద‌రు అమెరిక‌న్ సిబ్బంది కూడా ఓటింగ్‌లో పాల్గొన్న‌ది. అయితే డిజిట‌ల్ రూపంలో వ్యోమ‌గాములు ఓటేశారు. ఎల‌క్ట్రానిక్ బ్యాలెట్ ద్వార ఓటేసిన‌ట్లు మీన‌న్ తెలిపారు.

స్పేస్ స్టేష‌న్‌లో ఉన్న ల్యాప్‌టాప్ ద్వారా ఎల‌క్ట్రానిక్ ఓటును వినియోగించుకున్నారు. నాసా క‌మ్యూనికేష‌న్ వ్య‌వ‌స్థ ద్వారా ఆ డిజిట‌ల్ ఓట్లు భూమికి చేరుతాయి. టెక్సాస్ మ‌ధ్యంత‌ర ఎన్నిక‌ల్లో తాను ఓటు వేస్తున్న‌ట్లు మీన‌న్ తెలిపారు. ఆకాశం నుంచి కూడా ఓటు వేయ‌వ‌చ్చు అని, స్పేస్ స్టేష‌న్ నుంచి ముగ్గురం ఓటు వేశామ‌ని, ఎల‌క్ట్రానిక్ బ్యాలెట్ నింపి, దాన్ని భ‌ద్రంగా ఎల‌క్ష‌న్ అధికారుల‌కు పంపిన‌ట్లు అనిల్ మీన‌న్ తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events