అమెరికా మధ్యంతర ఎన్నికల్లో కొత్త చరిత్ర లిఖితమైంది. మిచిగన్ రాష్ట్రం నుంచి డెమోక్రటిక్ అభ్యర్థి అబ్దుల్ ఎల్ సయ్యద్ సేనేట్ రేసులో విజయం సాధించినట్లు అంచనా వేస్తున్నారు. రిపబ్లికన్ నేత మైక్ రోజర్స్పై ఆయన గెలుపొందినట్లు ప్రాథమిక ఫలితాల ద్వారా తెలుస్తోంది. దీంతో అమెరికా రాజకీయ చరిత్రలో సేనేటర్గా గెలిచిన తొలి ముస్లిం నేతగా అబ్దుల్ ఎల్ సయ్యద్ రికార్డు సృష్టించారు.

తాజా మధ్యంతర ఎన్నికల్లో అనేక మైలురాళ్లు చోటుచేసుకుంటున్నాయి. డోనాల్డ్ ట్రంప్ పాలనను వ్యతిరేకిస్తూ ఓటర్లు తీర్పును ఇస్తున్నారు. ముస్లిం సేనేటర్ మాత్రమే కాదు, తొలి నల్లజాతి మహిళా గవర్నర్, తొలి గే మేల్ సేనేటర్, తొలి మహిళా నేటివ్ అమెరికన్ గవర్నర్గా డెమోక్రటిక్ అభ్యర్థులు విజయాలు సాధించినట్లు తెలుస్తోంది.















