Skip to main content

Namaste NRI

హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించిన శ్రీకృష్ణ సదర్ సమ్మేళన్‌ పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేయడంలో ప్రభుత్వ సంకల్పానికి యాదవుల సంపూర్ణ సహకారం ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. మూసీ పునరుజ్జీవనం, మెట్రో రైలు విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు, భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులతో మరింతగా అభివృద్ధి సాధించి, దేశంలోనే ఆదర్శనగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలని అన్నారు.

హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో పెద్దఎత్తున నిర్వహించిన శ్రీకృష్ణ సదర్ సమ్మేళన్‌ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, యాదవ సోదర, సోదరీమణులందరికీ హైదరాబాద్ సదర్ ఉత్సవ శుభాకాంక్షలు తెలిపారు.హైదరాబాద్ నగరాభివృద్ధిలో యాదవ సోదరుల కృషి ఎంతో ఉందన్నారు. దేశంలో ఎక్కడి నుంచి నగరానికి ఏ పని కోసమొచ్చినా యాదవ సోదరులు ఆదరించి వారందరినీ అక్కున చేర్చుకున్నారని చెప్పారు. హైదరాబాద్ నగర అభివృద్ధిలో, ఇక్కడ శాంతి భద్రతలను కాపాడటంలో యాదవుల పాత్ర ఎంతో ఉందని ప్రశంసించారు.

హైదరాబాద్ నగరం జాతీయస్థాయిలో పేరు ప్రతిష్ఠలను సాధించి అభివృద్ధి చెందిన నగరంగా నిలబెట్టడంలో యాదవ సోదరులు కష్టపడాలని కోరారు. యాదవుల ఆత్మగౌరవం, హక్కులను కాపాడే విషయంలో ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసే బాధ్యత తనదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

గత ప్రభుత్వ హయాంలో సదర్ సమ్మేళనాన్ని అధికారికంగా నిర్వహించలేదని గుర్తుచేస్తూ, తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే యాదవ సోదరుల విజ్ఞప్తి మేరకు సదర్ సమ్మేళనాన్ని రాష్ట్ర ఉత్సవంగా గుర్తిస్తూ ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ఈ ఉత్సవాల కోసం ప్రభుత్వం రూ. 5 కోట్ల నిధులు విడుదల చేసినట్టు తెలిపారు.

బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి యాదవ్ తేజస్వి తో పాటు ఎన్నో ప్రాంతాల నుంచి ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని సదర్ ఉత్సవానికి మరింత శోభను తెచ్చారని వ్యాఖ్యానించారు.ఈ సదర్ ఉత్సవంలో మంత్రి పొన్నం ప్రభాకర్ INC, బీహార్ మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, ఎంపీలు AKY INCMP గా Dr మల్లు రవి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎంపీ ధర్మేంద్ర యాదవ్ , పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ B మహేష్ గౌడ్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, పలువురు ప్రజాప్రతినిధులు, శ్రీకృష్ణ సదర్ సమ్మేళన్‌ ఉత్సవ కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, వివిధ రాష్ట్రాలకు చెందిన యాదవ ప్రతినిధులు పాల్గొన్నారు.

డిప్యూటీ సిఎం మల్లు బట్టి విక్రమార్క మాట్లాడుతూ:

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన సదర్ సమ్మేళనంలో పాల్గొనడం ఎంతో ఆనందాన్నిచ్చింది. ఈ వేడుకలను ఘనంగా నిర్వహించిన అంజన్ కుమార్ యాదవ్ కి, ఉత్సవ కమిటీ సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు.

సదర్ ఉత్సవం కేవలం ఒక పండుగ మాత్రమే కాదు. యాదవ సోదరుల ఆత్మగౌరవానికి, తరతరాల సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీక. పశుసంపదను సంరక్షిస్తూ, పాడి పరిశ్రమకు వెన్నెముకగా నిలుస్తూ, తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో యాదవ సమాజం పోషిస్తున్న పాత్ర ఎంతో విశిష్టమైనది.యాదవ సోదరుల సంక్షేమానికి, వారి ఆర్థికాభివృద్ధికి, పశుసంవర్ధక రంగ బలోపేతానికి ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events