Skip to main content

Namaste NRI

మహంతి ఝాన్సీ రాణిగా టబు.. బర్త్‌డే గ్లింప్స్ రిలీజ్

నాగార్జున ప్రతిష్టాత్మకమైన 100వ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కింగ్‌ 100 పేరుతో రానున్న ఈచిత్రాన్ని అన్నపూర్ణా స్టూడియోస్‌ పతాకంపై రా కార్తీక్‌ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతున్నది. ఈ సినిమాలో టబు ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఇందులో ఆమె పోషిస్తున్న మహంతి ఝాన్సీరాణి పాత్రను పరిచయం చేస్తూ ఓ ప్రత్యేక గ్లింప్స్‌ని విడుదల చేశారు.

టబు పవర్‌ఫుల్‌ వాయిస్‌ఓవర్‌తో ఈ గ్లింప్స్‌ సాగింది. ప్రపంచంలో రెండు రకాల మనుషులుంటారు.. లక్‌ను నమ్మేవాళ్లు ఒకరు.. హార్డ్‌ వర్క్‌ని నమ్మేవాళ్లు మరొకరు. ఐ షేట్‌ లక్‌’ అనే డైలాగ్‌తో ఆమె పాత్ర పోకడను ఈ గ్లింప్స్‌ ఆవిష్కరించింది. భారీ జనసమూహం ముందు టబు ఎంట్రీ ఇవ్వడం, ప్రజలకు అభివాదం చేస్తూ ప్రమాణస్వీకారం చేయడం, ఈ సన్నివేశాలతో గ్లింప్స్‌ క్యూరియాసిటీని పెంచింది. చీరకట్టులో ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా ఈ గ్లింప్స్‌లో టబు కనిపించారు. క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 24న సినిమా విడుదల కానున్నది. అత్యంత పవర్‌ఫుల్‌ కథ, కథనాలతో రా కార్తీక్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రాజా మహదేవన్‌, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events