Skip to main content

Namaste NRI

అమెరికా ఎన్నికల్లో సత్తా చాటిన తెలుగు మహిళ

అమెరికా రాజకీయంలో భారత సంతతికి చెందిన ప్రజాప్రతినిధులు తమ ప్రభావాన్ని చాటుతున్నారు. తాజాగా జరిగిన యూఎస్ మధ్యంతర ఎన్నికల్లో తెలుగు మూలాలున్న డెమోక్రటిక్ నేత అరుణా మిల్లర్ మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా విజయం సాధించారు. గవర్నర్ వెస్ మూర్‌తో కలిసి వరుసగా రెండోసారి ఈ కీలక పదవిని సొంతం చేసుకుని ఆమె సరికొత్త చరిత్ర సృష్టించారు. అరుణా మిల్లర్ 1964 నవంబర్ 6న హైదరాబాద్‌లోని తెలుగు కుటుంబంలో జన్మించారు. ఆమెకు ఏడేళ్ల వయసు ఉన్నప్పుడు కుటుంబం అమెరికాకు వలస వెళ్ళింది. న్యూయార్క్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసిన ఆమె, మిస్సోరి యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

ఆ త‌ర్వాత‌ ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజనీర్‌గా కాలీఫోర్నియా, వర్జీనియా, హవాయీ రాష్ట్రాల్లో దాదాపు 25 ఏళ్ల పాటు సేవలు అందించారు. రోడ్డు భద్రత, ప్రజా రవాణా వ్యవస్థల ఆధునికీకరణ కోసం కృషి చేశారు. 1990లో మేరీల్యాండ్‌లోని మోంట్‌గోమరీ కౌంటీకి మారి అక్కడ స్థిరపడ్డారు. 2010లో తొలిసారి మేరీల్యాండ్ హౌస్ ఆఫ్ డెలిగేట్స్‌కు ఎన్నికై 2018 వరకు ప్రజాప్రతినిధిగా సేవలు అందించారు. 2022లో మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా గెలుపొంది, ఆ రాష్ట్రంలో అత్యున్నత స్థాయి ఎగ్జిక్యూటివ్ పదవిని అధిరోహించిన తొలి దక్షిణాసియా మహిళగా నిలిచారు. ఇప్పుడు మరోసారి గెలిచి తమ పట్టును నిరూపించుకున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events