Skip to main content

Namaste NRI

టైసన్ నాయుడు నుంచి మదరాసి రబ్బరు బొమ్మ మాస్ ఫోక్ సాంగ్.. ఎప్పుడంటే

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా డైరెక్టర్ సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ టైసన్ నాయుడు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తాజాగా మేకర్స్ మ్యూజిక్ ప్రమోషన్స్‌ను ప్రారంభిస్తూ, చిత్రంలోని ఫస్ట్ సింగిల్ అప్‌డేట్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలోని మదరాసి రబ్బరు బొమ్మ అనే మాస్ ఫోక్ సాంగ్‌ను నవంబర్ 6న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ మేరకు విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో హీరో హీరోయిన్లు సంప్రదాయ ఫోక్ లుక్‌లో కనిపిస్తూ కలర్‌ఫుల్ బ్యాక్‌డ్రాప్‌లో సందడి చేస్తుండటం పాటపై అంచనాలను విపరీతంగా పెంచేస్తోంది.

ఈ చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ను మునుపెన్నడూ చూడని సరికొత్త యాక్షన్ ప్యాక్డ్ క్యారెక్టర్‌లో డైరెక్టర్ సాగర్ కె చంద్ర ప్రెజెంట్ చేస్తున్నారు. ఈ సినిమాకు సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా, ముఖేష్ జ్ఞానేష్, అనిత్ డీవోపీగా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. అలాగే స్టన్ శివ, విజయ్, వెంకట్, రియల్ సతీష్ భారీ యాక్షన్ సీక్వెన్స్‌లకు కొరియోగ్రఫీ అందిస్తున్నారు. టాప్ టెక్నీషియన్లతో తెరకెక్కుతున్న ఈ చిత్రం మాస్ ఆడియెన్స్‌ను ఎంతగానో అలరించనుందని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events