
రాకేష్ వర్రే హీరోగా నటిస్తూ, నిర్మించిన చిత్రం మాయలేడి. మధుమిత సర్కార్ కథానాయిక. ప్రశంకర్ దర్శకుడు. హైదరాబాద్‌లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని నిర్వహించారు. రాకేష్ వర్రే మాట్లాడుతూ అద్భుతమైన ప్రేమకథ ఇది. ఏడాది కష్టపడి స్క్రిప్ సిద్ధం చేశాం. ఖర్చుకు అస్సలు వెనకాడలేదు. ప్రేక్షకులు హాయిగా ఎంజాయ్ చేసే మ్యూజికల్ లవ్‌స్టోరీ ఇది అని తెలిపారు. తన గార్ల్ఫ్రెండ్లోని డిఫరెంట్ ఎమోషన్స్‌ను క్రిష్ అనే అబ్బాయి ఎలా ఫేస్ చేశాడు అనేది ఈ సినిమాలో ఆసక్తికరమైన అంశమని దర్శకుడు ప్రశంకర్ చెప్పారు.ఈ నెల 13న సినిమా రిలీజ్ కానుంది.















