
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారు. మధ్యంతర ఎన్నికల్లో ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ అమెరికా కాంగ్రెస్‌లోని ఉభయ సభలపై పట్టు సాధించింది. కీలక రాష్ర్టాల్లో గవర్నర్ పదవులనూ కైవసం చేసుకుంది. ఈ ఫలితాలు అమెరికా రాజకీయాలపైనే కాకుండా అంతర్జాతీయ పరిణామాలపైనా ప్రభావం చూపనున్నాయి. ట్రంప్ సొంత పార్టీ అయిన రిపబ్లికన్లు తమకు బలమైన పట్టున్న టెక్సాస్, జార్జియా, ఐయోవా, ఓహియో రాష్ర్టాల్లో గవర్నర్ పదవులను కోల్పోయారు. సెనెట్ ఎన్నికల్లోనూ టెక్సాస్, మైనే, సౌత్ కరోలినా, నార్త్ కరోలినా, కాన్సాస్, ఐయోవా, ఓహియో రాష్ర్టాల్లో ఓటమిని చవిచూశారు. ఎన్నికల ప్రచారంలో ట్రంప్ స్వయంగా పాల్గొని, బ్యాలెట్‌పై తన పేరు ఉన్నట్లు భావించి ఓటేయాలని మద్దతుదారులకు పిలుపునిచ్చినా ఫలితం లేకుండా పోయింది.















