అమెరికా మధ్యంతర ఎన్నికల్లో అనేకమంది భారత సంతతి వ్యక్తులు విజయం సాదించారు. కేరళలో పుట్టిన నిత్యా రామన్ లాస్ ఏంజిల్స్ మేయర్ రేసులో ముందున్నారు. కేరన్ బాస్‌పై ఆమె గెలుపు ముంగిట నిలిచారు. దాదాపు 52 శాతం ఓట్లు ఆమెకు పోలయ్యాయి. దీంతో లాస్ ఏంజిల్స్ నగరానికి తొలి ఏషియన్-అమెరికన్ మేయర్‌గా నిత్యా రామన్ రికార్డు క్రియేట్ చేశారు. తాజా సమాచారం ప్రకారం నిత్యా రామన్‌కు 51.1 శాతం ఓట్లు పోలయ్యాయి. బాస్‌కు 48.33 శాతం ఓట్లు పడినట్లు తెలుస్తోంది.తోటి డెమోక్రటిక్ నేత అయిన కేరన్ బాస్‌తో పోటీపడేందుకు చివరి నిమిషంలో నిత్యా రామన్ నిర్ణయించారు.

నిత్యా రామన్ 1981లో కేరళలో పుట్టారు. ఆరేళ్ల వయసులో ఆమె అమెరికాకు వలస వెళ్లారు. 22 ఏళ్ల వయసులో ఆమె అమెరికా పౌరురాలిగా మారారు. హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ చేశారు. మసాచుసెట్స్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి అర్బన్ ప్లానింగ్‌లో ఆమె మాస్టర్స్ డిగ్రీ చేశారు. ట్రాన్స్‌పరెంట్ చెన్నై అనే అర్బన్ రీసర్చ్ గ్రూపును ఆమె స్థాపించారు.2013లో నిత్యా రామన్ లాస్ ఏంజిల్స్‌కు మారారు. సిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కోసం ఆమె పనిచేశారు. టైమ్స్ అప్ ఎంటర్‌టైన్మెంట్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఆమె చేశారు.















