Skip to main content

Namaste NRI

ప్రముఖ చిత్ర నిర్మాత లగడపాటి శ్రీధర్ చేతుల మీదగా యద్భావం తద్భవతి చిత్ర టీజర్ విడుదల

వరుణ్‌సందేశ్‌ హీరోగా రూపొందుతున్న విభిన్న కథాచిత్రం యద్భావం తద్భవతి. ఇనయ సుల్తానా, రేణుశ్రీ హీరోయిన్లు. రమేశ్‌ జక్కల దర్శకుడు. ప్రసన్నలక్ష్మి భూమిరెడ్డి నిర్మాత. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్‌ టీజర్‌ని ఆవిష్కరించి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.

వరుణ్‌సందేశ్‌ కెరీర్‌లోనే ఇది భిన్నమైన సినిమాగా నిలుస్తుందని మేకర్స్‌ చెబుతున్నారు. సుమన్‌, నాగమహేశ్‌, లోహిత్‌కుమార్‌, ధనరాజ్‌, శ్వేతవర్మ, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ ఇతర పాత్రలు పోషించిన ఈచిత్రానికి కెమెరా: శ్యామ్‌, సంగీతం: మిహిరామ్‌, నిర్మాణం: ప్రసన్నభూమి ఎంటర్‌టైన్మెంట్స్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events