మెగా కుటుంబంలో కథానాయకుడు సాయి ధరమ్ తేజ్ (సాయి దుర్గా తేజ్) పెళ్లి పీటలెక్కెందుకు రెడీ అయిపోయాడు. తను వివాహం చేసుకోబోయే అమ్మాయి తన చిన్ననాటి స్నేహితురాలు పేరు కిరణ్మయి. వీరిద్దరి నిశ్చితార్థం గ్రాండ్గా జరిగింది.ఈ ఎంగేజ్మెంట్లో తల్లిదండ్రులు డా. శివప్రసాద్, విజయ దుర్గా, అత్తయ్య మావయ్య చిరంజీవి సురేఖ లతో పాటు అల్లు అర్జున్, అల్లు స్నేహ రెడ్డి, రామ్ చరణ్, అల్లు శిరీష్ , వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీ , వైష్ణవ్ తేజ్ , నాగ బాబు, పద్మజ, నీహారిక, అల్లు అరవింద్ ఫ్యామిలీ, అఖీరా నందన్, నయనిక రెడ్డి, ఆద్య సహా మెగా కుటుంబం అంతా హాజరయ్యారు.సాయి దుర్గా తేజ్ స్నేహితులు మంచు మనోజ్ మౌనిక రెడ్డి, నవీన్ విజయ్ కృష్ణ, హర్ష, వెంకీ కుడుముల, హర్షిత్ రెడ్డి తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు.ఈ సందర్భంగా కొత్త జంటకు అభినందనలు తెలిపారు.ఈ విషయం తెలుసుకున్న అభిమానులు మెగా హీరోకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
























