కిశోర్ మూవీమేకర్స్ పతాకంపై ఎన్.ఎన్.కిశోర్ నిర్మిస్తున్న తొలి చిత్రం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. విజయ్‌రాజ్‌కుమార్, అర్చనా జోయస్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. అతిథి కీలకపాత్ర పోషిస్తున్నారు. దివాకర్ యడ్ల దర్శకుడు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్, హీరో ఆది సాయికుమార్ అతిథులుగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.

ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత కిశోర్ క్లాప్ ఇవ్వగా, ఆది సాయికుమార్ కెమెరా స్విచాన్ చేశారు. వి.వి.వినాయక్ స్క్రిప్ట్‌ని మేకర్స్‌కి అందజేశారు. ప్రేమలోని అందమైన అనుభూతిని నిజాయితీగా, హృదయాలకు హత్తుకునేలా చూపించాలనే ఉద్దేశంతో తెరకెక్కిస్తున్న సినిమా ఇదని దర్శకుడు దివాకర్ యడ్ల చెప్పారు. ఇంకా చిత్రబృందమంతా మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: కె.కె.రావు, సంగీతం: సుధా శ్రీనివాస్.















