Skip to main content

Namaste NRI

ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌.. ఊహాగానాలకు చెక్‌

టాలీవుడ్‌లో ప్రస్తుతం భారీ అంచనాలు నెలకొల్పిన ప్రాజెక్టుల్లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న గాడ్ ఆఫ్ వార్ ఒకటి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచే అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. భారీ బడ్జెట్‌తో, విభిన్నమైన కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే గత కొంతకాలంగా ఈ ప్రాజెక్ట్ విషయంలో పలు రకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాణ సంస్థ హారికా హాసిని క్రియేషన్స్ మధ్య విభేదాలు వచ్చాయని, ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారనే ప్రచారం అభిమానులను కలవరపెట్టింది. తాజాగా మేకర్స్ విడుదల చేసిన ఓ ఫొటోతో ఈ వార్తలకు చెక్ పడినట్లయింది.

గాడ్ ఆఫ్ వార్ పేరుతో ప్రచారంలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌ను భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థల సంయుక్త నిర్మాణంలో చినబాబు, నందమూరి కల్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

ఇంతటి క్రేజీ ప్రాజెక్ట్ ప్రారంభానికి ముందే ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తున్నాయంటూ సోషల్ మీడియాలో చర్చలు జరిగాయి. తాజాగా చిత్ర బృందం విడుదల చేసిన ఓ ఫొటో ఈ ప్రచారాలకు సమాధానంగా నిలిచింది. ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో పాటు నిర్మాతలు చినబాబు, కల్యాణ్ రామ్ కలిసి దిగిన ఫొటోను మేకర్స్ పంచుకున్నారు. ఈ ఫొటోలో నలుగురూ ఎంతో సంతోషంగా కనిపించడం విశేషం. దీంతో త్రివిక్రమ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారనే ప్రచారానికి బలం లేదని అభిమానులు భావిస్తున్నారు. అలాగే హారికా హాసిని, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలయికలోనే సినిమా కొనసాగనుందని స్పష్టమవుతోంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events