Skip to main content

Namaste NRI

అలియాస్‌ రుక్మిణి నుంచి పిచ్చి ప్రేమలో సాంగ్ రిలీజ్

నితిన్‌ హీరోగా నటిస్తున్న చిత్రం అలియాస్‌ రుక్మిణి. ఈ చిత్రానికి మురళీకాంత్‌ దేవసోత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. హీరో నాని సమర్పణలో ఆయన సోదరి దీప్తి గంటా నిర్మిస్తున్నారు. కృష్ణ ఓ రచయిత. భార్య అంటే పిచ్చి ప్రేమ. ఆమె పేరు మీదనే కథలు కూడా రాస్తుంటాడు. సజావుగా సాగిపోతున్న వీరి దాంపత్య జీవితంలో ఓ చిన్న సంఘటన అలజడి రేపుతుంది. ఈ నేపథ్యంలో వారి ప్రయాణం ఎలా సాగిందో తెలుసుకోవాలంటే అలియాస్‌ రుక్మిణి చూడాల్సిందే అంటున్నారు మేకర్స్‌.

ఈ సినిమా నుంచి పిచ్చి ప్రేమలో నన్నే ముంచుతావే అనే మెలోడీ గీతాన్ని విడుదల చేశారు. విజయ్‌ బుల్గానిన్‌ స్వరపరచిన ఈ పాటను కృష్ణకాంత్‌ రచించారు. కార్తీక్‌ ఆలపించారు. చిరుచిరు చిలకవే చిన్నెలున్న అలకవే చిత్రమైన మనసువే వయ్యారి, అరకొర పొగరువే అందమైన సగమువే, అల్లుకున్న సొగసువే నా దేవి..పిచ్చి ప్రేమలో నన్నే ముంచుతావే అంటూ కొత్తగా పళ్లైన జంట మధ్య అనుబంధాన్ని ఆవిష్కరిస్తూ ఈ పాట సాగింది. ఈ చిత్రం డిసెంబర్‌ 4న ప్రేక్షకుల ముందుకురానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events