Skip to main content

Namaste NRI

మైక్రోసాఫ్ట్ సేవల్లో అంతరాయం .. అమెరికాలో

ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన మైక్రోసాఫ్ట్ సాంకేతిక అంతరాయం కారణంగా అమెరికాలోని ఒక జైలు అధికారులు విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ ఔట్‌లుక్ ఈమెయిల్ సేవలు నిలిచిపోవడంతో, బెయిల్ మంజూరైన ఖైదీలను విడుదల చేయడం ఆలస్యమైంది. కొలరాడో రాష్ట్రంలోని అరపాహో కౌంటీ డిటెన్షన్ ఫెసిలిటీ లో ఈ ఘటన చోటుచేసుకుంది.

సాధారణంగా ఖైదీల విడుదలకు సంబంధించిన బాండ్ డబ్బులను ఆన్‌లైన్‌లో చెల్లించినప్పుడు, ఆ సమాచారం జైలు అధికారులకు మైక్రోసాఫ్ట్ ఔట్‌లుక్ ఈమెయిల్ నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. దానిని ధృవీకరించుకున్న తర్వాతే అధికారులు ఖైదీలను విడుదల చేస్తారు. అయితే, మైక్రోసాఫ్ట్ సేవల్లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా అధికారులకు ఈమెయిల్ నోటిఫికేషన్లు అందడం నిలిచిపోయింది. దీంతో ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించినప్పటికీ, ధృవీకరణ లేక ఖైదీలను జైలులోనే ఉంచాల్సి వచ్చింది.

ఈ విషయంపై జైలు అధికారులు స్పష్టతనిచ్చారు. మైక్రోసాఫ్ట్ అవుటేజ్ కారణంగా ఆన్‌లైన్ బాండ్ చెల్లింపుల ప్రక్రియకు అంతరాయం కలిగింది. ఔట్‌లుక్ ఈమెయిల్ సేవలు పునరుద్ధరించబడే వరకు, ఖైదీలను తక్షణమే విడుదల చేయాలనుకునే వారు నేరుగా జైలు వద్దకు వచ్చి నగదు చెల్లించాలి. లేదంటే సేవలు తిరిగి ప్రారంభమయ్యే వరకు వేచి చూడాలి. అసౌకర్యానికి చింతిస్తున్నాం అని పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events