మరణశిక్ష విధింపుపై తాత్కాలిక నిషేధం విధించాలని కోరిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం ముసాయిదా తీర్మానానికి వ్యతిరేకంగా భారత్ ఓటు వేసింది. చట్టబద్ధ మరణశిక్షను హింస, చట్టవిరుద్ధ హత్యలతో పోల్చడాన్ని కూడా వ్యతిరేకించింది. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి బృందం ప్రథమ కార్యదర్శి భావిక మంగళానందన్ రెండు తీర్మానాలపై భారత దేశ వైఖరిని వివరించారు.

న్యాయస్థానేతర, విచారణ జరపకుండా లేదా ఏకపక్ష మరణశిక్షలపై ముసాయిదా తీర్మానాన్ని భారత్ సమర్థించింది. అయితే, మానవ హక్కుల మండలి 62వ సమావేశంలో ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధి సమర్పించిన నివేదికను ప్రస్తావిస్తూ, దేశాలు ఆ సిఫారసులను పరిగణనలోకి తీసుకోవాలని కోరిన ఆపరేటివ్ పేరా 6కు భారత్ అంగీకరించలేదు. మరణశిక్ష స్వతహాగానే హింస లేదా దుర్వ్యవహారమే అనే వాదనతో తీవ్రంగా విభేదించింది.















