Skip to main content

Namaste NRI

మళ్లీ హద్దు మీరిన చైనా.. భారత గగనతలంలోకి

ఒక చైనా సైనిక విమానం ఈ నెల 12న సిక్కింలోని భారత గగనతలంలోకి చొరబడి 20-25 నిమిషాల పాటు చక్కర్లు కొట్టిందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఆ ప్రాంతం భారత భూభాగంలోని అత్యంత సున్నితమైన భాగాలలో ఒకటైన సిలిగురి కారిడార్ కు అభిముఖంగా ఉండడంతో ఈ పరిణామం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈనెల 12న ఉదయం 8 గంటల సమయంలో చైనా విమానం కదలికలను భారత వైమానిక దళం పసిగట్టిందని, తమ భూభాగంలోకి తిరిగి వెళ్లాలని పదేపదే హెచ్చరికలు జారీ చేసిందని ఆ వర్గాలు తెలిపాయి. 25 వేల అడుగుల ఎత్తులో ఈ విమానం కదలికలను గుర్తించినట్టు పేర్కొన్నాయి.


సిలిగురి కారిడార్ పశ్చిమ బెంగాల్లోని ఒక సన్నని భూభాగం. ఇది అత్యంత సన్నగా ఉన్న చోట సుమారు 20-22 కిలోమీటర్ల వెడల్పుతో ఉండి, ఈశాన్య ప్రాంతాన్ని భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలతో కలుపుతుంది. దీనిని చికెన్స్ నెక్ అని కూడా పిలుస్తారు. ఇది చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్లకు సమీపంలో ఉన్నందున దీనిపై జరిగే ఏ సాధారణ సైనిక కార్యకలాపమైనా భద్రతా ప్రణాళికల అధికారుల దృష్టిని తక్షణం ఆకర్షిస్తుంది. చైనాకు చెందిన టిబెట్ స్వయంప్రతిపత్తి ప్రాంతంతో సరిహద్దును సిక్కిం పంచుకుంటుంది. డోక్లామ్ పీఠభూమికి ఇది సమీపంలో ఉంటుంది. చైనా సైనిక విమానాలు సరిహద్దు వెంబడి ఆందోళన కలిగించడం ఇది మొదటిసారి కాదు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఎక్కువగా ఉన్న సమయాల్లో ఇలాంటి ఘటనలు పలుమార్లు చోటుచేసుకున్నాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events