
ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఒక కీలక ముసాయిదా తీర్మానానికి భారత్ అనుకూలంగా ఓటు వేసింది. పాలస్తీనా ప్రజలకు, అలాగే ఆక్రమిత సిరియాలోని గోలాన్ ప్రాంతంలో నివసిస్తున్న అరబ్ ప్రజలకు తమ సహజ వనరులపై శాశ్వత సార్వభౌమ హక్కులు కలిగి ఉండాలనే వారి హక్కులను ఆ తీర్మానం మరోసారి ధ్రువీకరిస్తున్నది. జనరల్ అసెంబ్లీ 81వ సమావేశంలోని రెండో కమిటీ ఈ తీర్మానాన్ని ఆమోదించగా, భారత్ సహా 151 దేశాలు మద్దతిచ్చాయి.















