Skip to main content

Namaste NRI

శర్వా భోగి.. థియేటర్లలోకి వచ్చేది అప్పుడే!

శర్వానంద్‌ కథానాయకుడిగా ఉత్తర తెలంగాణ నేపథ్య కథాంశంతో రూపొందుతున్న చిత్రం భోగి. ఈ పీరియాడిక్‌ డ్రామాకు సంపత్‌నంది దర్శకత్వం వహిస్తున్నారు. కేకే రాధామోహన్‌ నిర్మాత. సెన్సార్‌ సమస్యల కారణంగా ఈ సినిమా రిలీజ్‌ అలస్యమైన విషయం తెలిసిందే.1960 దశకంలో తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని ఓ గ్రామంలో జరిగే కథ ఇది.

ఇటీవల విడుదలైన పాటలకు, ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన లభించిందని, ఈ సినిమాలో శర్వానంద్‌ రా అండ్‌ రస్టిక్‌ లుక్‌లో కనిపిస్తారని, ఆయన కెరీర్‌లోనే ఇంటెన్స్‌ పర్‌ఫార్మెన్స్‌ కనబరిచారని మేకర్స్‌ తెలిపారు. అనుపమ పరమేశ్వరన్‌, డింపుల్‌ హయాతి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి భీమ్స్‌ సిసిరోలియో సంగీతాన్నందించారు.ఈ చిత్రాన్ని ఈ నెల 27న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్‌ తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events