బాలీవుడ్ అగ్ర కథానాయకుడు షారుఖ్‌ఖాన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు ప్రముఖ అంతర్జాతీయ మాగజైన్ వెరైటీ విడుదల చేసిన ది 100 గ్రేటెస్ట్ మూవీ స్టార్స్ ఆఫ్ ఆల్‌టైమ్ జాబితాలో షారుఖ్‌కు చోటు లభించింది. ఈ జాబితాలో ఆయనది 92వ స్థానం కావడం గమనార్హం. అంతేకాదు, ఈ జాబితాలో స్థానం సంపాదించుకున్న ఏకైక భారతీయ నటుడు షారుఖ్ మాత్రమే కావడం విశేషం.

ఈ మాగజైన్ షారుఖ్ గురించి ప్రస్తావిస్తూ కెరీర్ తొలినాళ్లలో బాజీగర్, డర్ లాంటి ప్రతినాయక పోకడలున్న పాత్రలతో మెప్పించి, తదనంతరం దిల్వాలే దుల్హనియా లే జాయింగే, దేవదాస్ తదితర చిత్రాల ద్వారా రొమాంటిక్ కింగ్‌గా ప్రేక్షకుల హృదయాల్లో చెదరని ముద్ర వేసుకొన్న సూపర్‌స్టార్ షారుఖ్ అంటూ కొనియాడింది. ప్రముఖ హాలీవుడ్ నటీనటులు సిల్వెస్టర్ స్టాలిన్ (99), ఎడిల్ ముర్ఫీ (96), జొవాక్విన్ ఫ్యూనిక్స్ (93), ఎమ్మా స్టోన్ (94), ఫిలిప్ సెయ్మర్ హాఫ్మాన్ (95) స్థానాలతో సరిపెట్టుకోగా, వారందరినీ వెనక్కి నెట్టి, షారుఖ్ 92వ స్థానాన్ని కైవసం చేసుకోవడం విశేషం.















