స్వీయ దర్శకత్వంలో అల్తాఫ్ హసన్ హీరోగా నటిస్తున్న చిత్రం రాజిగాడు రాజయ్యాడు. ఈ సినిమాలో ప్రముఖ కవి, గాయకుడు డా॥ గోరటి వెంకన్న కీలక పాత్రను పోషిస్తున్నారు. గురువారం హైదరాబాద్‌లో టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా గోరటి వెంకన్న మాట్లాడుతూ ఈ సినిమా కోసం గొప్ప కథను ఎంచుకున్నారు. ఇప్పటికీ మూడుసార్లు సినిమా చూసినా బోర్ కొట్టలేదు. తెరపై ఓ జీవితాన్ని చూసిన అనుభూతి కలిగింది. ఇందులో నేనొక మంచి పాత్రను పోషించాను. మూస చిత్రాలకు భిన్నంగా అల్తాఫ్ ఓ చరిత్ర సృష్టించబోతున్నాడు అన్నారు.

ప్రతీ ఒక్కరికి స్ఫూర్తినిచ్చే కథ ఇదని, గోరటి వెంకన్న తన తండ్రి పాత్రలో నటించారని నటుడు, దర్శకుడు అల్తాఫ్ హసన్ అన్నారు. అనుశ్రీ, గోరటి వెంకన్న, గీతా అగర్వాల్, రాజేంద్రమోహన్, శ్రీవర్ధన్ త్రివేది తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: పి.మణికర్ణన్, సంగీతం: జగదీశ్ సత్యన్, కథ: డా॥ విజయ్‌భాస్కర్, నిర్మాతలు: బత్తుల పర్విన్, మనోజ్ అర్రోల, చిన్ని, దర్శకత్వం: అల్తాఫ్ హసన్.















