పూజారెడ్డి ప్రధానపాత్రలో నటించిన చిత్రం వ్యూ. ది పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఉపశీర్షిక. ప్రదీప్, సోనియా కీలకపాత్రధారులు. మహేశ్ కాంపెల్లి దర్శకుడు. సత్య చౌదరి నిర్మాత. శుక్రవారం(నేడు) సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. సినిమాలో భాగం కావడం పట్ల చిత్ర నటీనటులంతా సంతోషం వెలిబుచ్చారు.

ఈ కథ నా వ్యూ పాయింట్లోనుంచి చెప్పింది. మంచి సినిమా చేశానని గర్వంగా చెప్పగలను. సినిమా చూస్తున్నంతసేపు ఈ కథ మన ఇంట్లోనో, పొరిగింట్లోనో జరుగుతున్న అనుభూతి కలుగుతుంది. డైరెక్టర్‌గా కంటే మంచి స్టోరీ టెల్లర్గా పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నా అని దర్శకుడు మహేశ్ కాంపెల్లి అన్నారు. ఇంకా నిర్మాత సత్య చౌదరి, డిస్ట్రిబ్యూటర్ బాపిరాజు కూడా మాట్లాడారు.















