Skip to main content

Namaste NRI

రాధికా ఆప్టే వ్యాఖ్యలపై కీర్తి సురేశ్ క్లారిటీ!

అక్క వెబ్‌ సిరీస్‌ ప్రమోషన్‌లో భాగంగా దక్షిణాది సంప్రదాయంపై, అలాగే దక్షిణాదికి చెందిన ఓ అగ్ర హీరో సినిమాపై రాధికా ఆప్టే చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో తీవ్ర దుమారం రేకెత్తించాయి. ఆ సమయంలో ఆమె పక్కనే కీర్తి సురేశ్‌ కూడా ఉండటం, నవ్వుతూ ఆమె మాటలు వినడం కూడా విమర్శలకు కారణమైంది. దీనిపై తాజాగా కీర్తి సురేశ్‌ స్పందించారు.

తన తాజా సినిమా సత్యవాన్‌ సావిత్రి సినిమా ప్రమోషన్‌లో భాగంగా రాధిక ఆప్టే మాటలను ఆమె ప్రస్తావిస్తూ సినిమాలో మేనమామతో పెళ్లి గురించి రాధిక ఆప్టే ఏ ఉద్దేశంతో మాట్లాడారో అప్పుడు నాకర్థం కాలేదు. ఆమె మన దక్షిణాది సాంప్రదాయం గురించి మాట్లాడుతున్నదని ఆ తర్వాత అర్థమైంది. ఉత్తరాది వాళ్లకు మన సాంప్రదాయాల గురించి తెలియకపోవచ్చు. నావరకూ నేను మన సంస్కృతిని ఎప్పటికీ తక్కువ చేసి మాట్లాడను అంటూ వివరణ ఇచ్చారు కీర్తి సురేశ్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events