Skip to main content

Namaste NRI

వ్యూ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్

పూజారెడ్డి ప్రధానపాత్రలో నటించిన చిత్రం వ్యూ. ది పాయింట్‌ ఆఫ్‌ వ్యూ అనేది ఉపశీర్షిక. ప్రదీప్‌, సోనియా కీలకపాత్రధారులు. మహేశ్‌ కాంపెల్లి దర్శకుడు. సత్య చౌదరి నిర్మాత. శుక్రవారం(నేడు) సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించారు. సినిమాలో భాగం కావడం పట్ల చిత్ర నటీనటులంతా సంతోషం వెలిబుచ్చారు.

ఈ కథ నా వ్యూ పాయింట్‌లోనుంచి చెప్పింది. మంచి సినిమా చేశానని గర్వంగా చెప్పగలను. సినిమా చూస్తున్నంతసేపు ఈ కథ మన ఇంట్లోనో, పొరిగింట్లోనో జరుగుతున్న అనుభూతి కలుగుతుంది. డైరెక్టర్‌గా కంటే మంచి స్టోరీ టెల్లర్‌గా పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నా అని దర్శకుడు మహేశ్‌ కాంపెల్లి అన్నారు. ఇంకా నిర్మాత సత్య చౌదరి, డిస్ట్రిబ్యూటర్‌ బాపిరాజు కూడా మాట్లాడారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events