అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ చైనాలోని షెన్జెన్లో తొలిసారి త్రైపాక్షిక సమావేశం నిర్వహించారు. 90 నిమిషాలపాటు సాగిన ఈ భేటీ అనంతరం డిక్లరేషన్ టువార్డ్స్ పీస్ పేరుతో నాలుగు అంశాల ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. ఐక్యరాజ్యసమితిని మరింత సమర్థంగా తీర్చిదిద్దేందుకు సంస్కరణలు చేపట్టాలని, ప్రపంచదేశాల ప్రయోజనాల కోసం శుద్ధి చేసిన చమురు ఉత్పత్తి, సరఫరాను పెంచాలని నిర్ణయించారు. అణు యుద్ధాన్ని ఎవరూ గెలవలేరని, అణ్వాయుధాల ముప్పును తగ్గించేందుకు, వాటి వ్యాప్తిని నిరోధించేందుకు చర్చలు జరుపాలని అంగీకరించారు.

అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు తన అధికార పరిధిని దుర్వినియోగం చేయరాదని స్పష్టంచేశారు. రెండో ప్రపంచ యుద్ధానంతరం అంతర్జాతీయ వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత మూడు దేశాలపై ఉందని జిన్పింగ్ పేర్కొన్నారు. వివాదాలను చర్చలు, దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్, పుతిన్ చర్చించారు. అయితే భవిష్యత్తులో ఈ తరహా సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పుతిన్ తెలిపారు. విభేదాలున్న దేశాలతో చర్చలకు దూరంగా ఉండటం వల్ల సమస్యలు పరిష్కారం కావని ట్రంప్ వ్యాఖ్యానించారు.















