Skip to main content

Namaste NRI

ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అలక.. రాజీనామా?

కడప జిల్లా రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవి కేటాయింపు కూటమి పార్టీల మధ్య చిచ్చు రేపింది. తమ కుటుంబ సభ్యుడైన డాక్టర్ చదిపిరాళ్ల రాజేష్ రెడ్డికి కడప జెడ్పీ పీఠం దక్కుతుందని చివరి వరకు ఆశించిన జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి తీవ్ర నిరాశ ఎదురైంది. కూటమి నేతల సుదీర్ఘ చర్చల అనంతరం కడప జెడ్పీ సీటును టీడీపీ నేత పుత్తా నరసింహా రెడ్డికి ఖరారు చేయడంతో, స్థానిక ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కీలకంగా పనిచేసిన ఆదినారాయణ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ పరిణామంతో అలకబూనిన ఆయన రాత్రికి రాత్రే తన అనుచరులతో కలిసి విజయవాడకు చేరుకున్నారు. జెడ్పీ పీఠం దక్కకపోవడంతో తన ఎమ్మెల్యే పదవితో పాటు, జమ్మలమడుగు, ముద్దనూరు, ఎర్రగుంట్ల జడ్పీటీసీ సభ్యులతో కూడా రాజీనామా చేయించే ఆలోచనలో ఆయన ఉన్నట్లు జిల్లా వ్యాప్తంగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ విషయాన్ని ఆయన నేరుగా విజయవాడలో మీడియా సమావేశం పెట్టి చెప్తారనే ప్రచారం జరుగుతోంది.

అయితే ఆదినారాయణ రెడ్డిని బుజ్జగించేందుకు బీజేపీ పెద్దలు రంగంలోకి దిగారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఆదినారాయణ రెడ్డితో భేటీ అయ్యారు. ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events