Skip to main content

Namaste NRI

పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద యువకుడి హల్‌చల్..!

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాసం వద్ద ఒక యువకుడు వీరంగం సృష్టించాడు. ఖమ్మం నగరంలోని బల్లేపల్లికి చెందిన భట్టు సుచేతన్ నాయక్ అనే వ్యక్తి తన అప్పులు తీర్చడానికి పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం చేయాలని కోరుతూ గత 16 రోజులుగా ఆయనను కలిసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే మంగళగిరి నుంచి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 35లో ఉన్న పవన్ నివాసం వద్దకు చేరుకున్న సుచేతన్, తన కష్టాలను రాసిన ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ నినాదాలు చేశాడు.

అయితే, భద్రతా కారణాల దృష్ట్యా విధుల్లో ఉన్న బౌన్సర్లు అతడిని అడ్డుకోవడంతో సుచేతన్ ఒక్కసారిగా ఆగ్రహానికి లోనయ్యాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో ఛాతీ, చేతులపై కోసుకుని గాయపర్చుకోవడమే కాకుండా, అడ్డుకోబోయిన సిబ్బందిపైనా దాడికి ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన బౌన్సర్లు అతడి వద్ద ఉన్న కత్తిని లాగేసుకుని జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సుచేతన్‌ను అదుపులోకి తీసుకున్నారు. పవన్ నివాస సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ ఎస్సై సందీప్ కేసు నమోదు చేశారు. అనంతరం సుచేతన్‌కు కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులు, ఇలాంటి పిచ్చి పనులు మళ్లీ చేయొద్దని హెచ్చరించి అతడి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events