ప్రముఖ విద్యావేత్త, శాసనమండలి మాజీ సభ్యులు శతవసంతాలు చుక్కా రామయ్య (ఐఐటీ రామయ్య)శత వసంతాలు పూర్తి చేసుకుని కొత్త వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన నివాసానికి వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.


చుక్కా రామయ్య గారి జన్మదినోత్సవం తెలంగాణ ప్రజలకు, విద్యా వ్యవస్థకు గొప్ప పర్వదినమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.


స్వాతంత్య్ర ఉద్యమం, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన రామయ్య ఐఐటీ అనే పదాన్ని ప్రజలకు, విద్యార్థులకు పరిచయం చేసిన గొప్ప విద్యావేత్త అని కొనియాడారు. విద్యావేత్తగానే కాకుండా శాసనమండలిలో సభ్యుడిగా కూడా ఈ ప్రాంతంపై తనదైన ముద్రను వేశారని అన్నారు.















