ఇండోనేషియాలోని బాలిలో కొలువుదీరిన 50 అడుగుల భారీ గణేశుడి విగ్రహం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. సింథటిక్ రాటన్‌తో రూపొందించిన ఈ శిల్పం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సపోర్టెడ్ సింథటిక్ రాటన్ శిల్పంగా గుర్తింపు పొందింది. అలాస్ హరమ్ బాలి సంస్థ గిన్యార్ ప్రాంతంలో దీనిని తీర్చిదిద్దింది. ఇండోనేషియాలోని భారత రాయబార కార్యాలయం ఈ విగ్రహాన్ని ఆవిష్కరించింది.

ఈ గణేశ విగ్రహం 15,315 మీటర్ల (50 అడుగుల 2 అంగుళాల) ఎత్తుతో నిలిచింది. పూర్తిగా ఆధారంపై నిలబెట్టిన, కృత్రిమ బెత్తంతో తయారు చేసిన అత్యంత ఎత్తైన విగ్రహంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ దీనిని గుర్తించింది. బాలికి చెందిన అలస్ హరుమ్ బాలి అనే సంస్థ ఈ విగ్రహాన్ని రూపొందించింది.















