తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన యువతరం కామెడీ ఎంటర్టైనర్ ఈఎన్ఈ రిపీట్. ఈ చిత్రంలో విశ్వక్సేన్, అభినవ్ గోమఠం, వెంకటేశ్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి మరోమారు ఆకట్టుకున్నారు. సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతున్నది. ఈ సందర్బంగా హైదరాబాద్‌లో నిర్వహించిన బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్‌లో తరుణ్‌భాస్కర్ మాట్లాడారు. ప్రేక్షకులే గేమ్ ఛేంజర్స్ అని ఈఎన్ఈ రిపీట్‌తో మరోమారు రుజువైంది. ఈ విజయం దర్శకుడిగా నన్ను పరిపూర్ణుడ్ని చేసింది. ఇకనుంచి దర్శకుడిగా అన్ని వర్గాల ప్రేక్షకులూ కావాల్సిన సినిమాలు తీస్తాను. తక్కువ అంచనా వేసిన వారందికీ చెబుతున్నా. ఈ సినిమా నాకు గొప్ప హోప్ ఇచ్చింది. ఒక అథెంటిక్ వాయిస్ ఎంత దూరం వెళ్తుందో చూపిస్తా. డ్యూటీ ఎక్కుతున్నా. నా వాయిస్ ఏంటనేది ఇకనుంచి చూపిస్తాను. ఇకనుంచి ప్రేక్షకులే నా బాస్. వారి ప్రేమే నాకు కావాలి. చూడని వారుంటే త్వరగా సినిమా చూడండి. చూసిన వారు మళ్లీ రిపీట్‌లో చూడండి అన్నారు.

ఈ సినిమా విజయం నాకు చాలా రిలీఫ్‌ని ఇచ్చింది. నేటి యువత జీవితాలనే తెరపై ఆవిష్కరించాడు తరుణ్. ఆయన వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. కెరీర్ తొలినాళ్లలో నాకు అండగా నిలిచిన వ్యక్తి, నా ఎదుగుదలకు కారణమైన వ్యక్తి తరుణ్‌భాస్కర్. ఈ టీమ్‌తో నా స్నేహం మరిచిపోలేనిది. థియేటర్లలో రన్ అద్భుతంగా ఉంది. నిన్ననే బ్రేక్ ఈవెన్ అయింది. రేపు 50కోట్లు టచ్ చేయబోతున్నాం. ఇంత విజయానికి కారణమైన ఈ టీమ్‌కు పేరుపేరునా ధన్యవాదాలు అని హీరో విశ్వక్సేన్ అన్నారు.















