Skip to main content

Namaste NRI

బంజారాహిల్స్‌లో భూముల వేలం.. గజం ఎంతో తెలిస్తే షాక్!

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో మరోసారి భారీ వేలంపాటకు రంగం సిద్ధమైంది. నగరంలోని అత్యంత ఖరీదైన బంజారాహిల్స్‌కు కూతవేటు దూరంలో ఉన్న 8 ప్రీమియం ఓపెన్ ప్లాట్లను విక్రయించేందుకు హెచ్‌ఎండీఏ ఏర్పాట్లు పూర్తి చేసింది. షేక్‌పేట్ మండలం హకీంపేట్ గ్రామంలోని ఎమ్మెల్యే కాలనీ సమీపంలో ఉన్న ‘హుడా హైట్స్’ లేఅవుట్‌లో ఈ భూములు ఉన్నాయి. 1,084 నుంచి 1,438 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన ఈ ప్లాట్ల కనీస ధరను గజానికి ఏకంగా రూ. 2 లక్షలుగా అధికారులు నిర్ణయించారు.

నవంబర్ 25 బుధవారం నాడు ఎంఎస్‌టీసీ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆన్‌లైన్‌లో ఈ బిడ్డింగ్ ప్రక్రియ కొనసాగనుంది. అయితే, ఈ వేలంలో పాల్గొనేందుకు ఒక్కో ప్లాట్‌కు రూ. 1 కోటి చొప్పున ధరావత్తు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకునే గడువు ఇప్పటికే నవంబర్ 23తో ముగిసింది.

నవంబర్ నెలలో నగరవ్యాప్తంగా చేపడుతున్న భూముల విక్రయాల్లో భాగంగా నిర్వహిస్తున్న ఈ వేలానికి బిల్డర్లు, పారిశ్రామికవేత్తల నుంచి భారీ స్పందన వస్తోందని హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆశాభావం వ్యక్తం చేశారు. బంజారాహిల్స్‌ వంటి కీలక ప్రాంతానికి చేరువలో ఉండటం, వాణిజ్య అవసరాలకు ఎంతో అనుకూలంగా ఉండటంతో ఈ వేలంలో ధరలు ఆకాశాన్ని తాకే అవకాశం కనిపిస్తోంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events