యుద్ధాన్ని ముగించే విషయంలో తమ 7 షరతులకు అంగీకరించే వరకు అమెరికాతో చర్చలు జరపబోమని ఇరాన్ మళ్లీ స్పష్టంచేసింది. హర్మూజ్ జలసంధిలో అమెరికా సైనిక రక్షణలో ప్రయాణిస్తున్న మూడు చమురు ట్యాంకర్ల ను సీమైన్లతో ఢీకొట్టి ముంచేసినట్టు తెలిపింది. అమెరికా తీరు మారకపోతే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతాయని వార్నింగ్ ఇచ్చింది.

ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ గాలిబఫ్ మాట్లాడుతూ షరతులకు అమెరికా ఒప్పుకుంటేనే చర్చలు ముందుకు సాగుతాయని చెప్పారు. అయితే ఆ ఏడు షరతులు ఏమిటన్నది మాత్రం ఇరాన్ వెల్లడించలేదు. ఆ దేశంపై ఆంక్షలు ఎత్తివేయడం, ఇరాన్ ఓడరేవులపై అమెరికా దిగ్బంధనం తొలగించడం, స్వాధీనం చేసుకున్న ఇరాన్ ఆస్తులను తిరిగివ్వడం వంటివి ఆ జాబితాలో ఉన్నాయి.ఒకవేళ శత్రుదేశం మొండిగా ముందడుగు వేస్తే తాము కూడా పరిధి దాటి దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరికలు చేసింది.















