టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టికి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్‌గా మారింది. హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్న తన నివాసాన్ని అనుష్క ఏకంగా రూ. 12 కోట్లకు విక్రయించినట్లు మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. 2025లో వచ్చిన ‘ఘాటీ’ సినిమా తర్వాత ఆమె తెలుగు సినిమాలకు గుడ్ బై చెప్పి, శాశ్వతంగా తన సొంత ఊరైన మంగళూరుకు మకాం మార్చబోతున్నారని కొన్ని కథనాలు పేర్కొనడంతో అభిమానుల్లో గందరగోళం మొదలైంది.

అయితే, ఈ ఇంటి అమ్మకం వార్తలపై అనుష్క శెట్టి గానీ, ఆమె టీమ్ గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఆమె టాలీవుడ్‌కు దూరమవుతున్నారన్న ప్రచారంలో నిజం లేదని సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

మరోవైపు, అనుష్క కెరీర్ పరంగా కొత్త ప్రాజెక్టులతో బిజీగానే ఉన్నారు. ప్రస్తుతం ఆమె మలయాళంలో తెరకెక్కుతున్న ‘కథనార్: ది వైల్డ్ సోర్సెరర్’ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అంతేకాకుండా, తనకు ఎన్నో విజయాలను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌తో మరో కొత్త తెలుగు సినిమా చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.















