ఈజిప్ట్ రాజధాని కైరో సమీపంలోని గిజా గవర్నరేట్ రింగ్ రోడ్ హైవేపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పెట్రోల్ ట్యాంకర్ బోల్తాపడ పేలడంతో 31 మంది మృతి చెందగా మరో 20 మంది గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గ్రేటర్ కైరోలో కీలకమైన రహదారులను కలిపే రద్దీగా ఉండే రింగ్ రోడ్డు హైవేపై వెళ్తున్న ఇంధన ట్యాంకర్ అదుపుతప్పి బోల్తాపడటంతో పెట్రోల్ ఒలికి భారీగా మంటలు చెలరేగాయి.ఈ మంటల్లో 20కి పైగా కార్లు, ద్విచక్ర వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి.

అగ్నిమాపక సహాయక బృందం అక్కడికే చేరుకుని మంటలను ఆర్పేసరికే 31 మంది మృతి చెందారు. ప్రజలు రోడ్ల పైకి భారీగా చేరుకోవడంతో సహాయక చర్యలకు ఆటకం ఏర్పడింది.ట్యాంకర్ ముందు హైటెన్షన్ విద్యుత్ వైరు తెగిపడింది. దీంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగిందని సోషల్ మీడియాలో పలు కథనాలు వెలవడ్డాయి. అయితే ఈ వార్తలను ఈజిప్ట్ రవాణా మంత్రిత్వ శాఖ అధికారికంగా ఖండించింది.















