నాగచైతన్య కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం వృషకర్మ.మీనాక్షి చౌదరి కథానాయిక. కార్తీక్ దండు దర్శకత్వం. బీవీఎస్‌ఎన్ ప్రసాద్, సుకుమార్ నిర్మించారు. నెల్లూరులో ట్రైలర్‌ను విడుదల చేశారు. అతీంద్రియ శక్తులు, ట్రెజర్ హంటింగ్, వేద విజ్ఞానం నేపథ్య అంశాలతో ట్రైలర్ ఆసాంతం ఉత్కంఠను పంచింది. ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ వృషకర్మ వినూత్నమైన కథ. ఎప్పుడూ చూడని విజువల్స్ ఈ సినిమాలో ఉంటాయి. ప్రతీ ఫ్రేమ్‌లో వీఎఫ్‌ఎక్స్ వర్క్ ప్రేక్షకులకు కొత్త అనుభూతినందిస్తుంది. తెలుగు సినిమా గర్వంగా చెప్పుకునే చిత్రమవుతుంది అన్నారు నాగచైతన్య.

దర్శకుడు కార్తీక్ దండు సరికొత్త విజన్‌తో ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేశాడని చెప్పారు. సినిమా విజయంపై ధీమాగా ఉన్నామని నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ పేర్కొన్నారు. డిసెంబర్ 4న విడుదల కానుంది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.















