Skip to main content

Namaste NRI

భారత స్థావరాలపై చైనా కన్ను?

భారత్‌పై నిరంతరం నిఘా పెట్టేందుకు చైనా, పాకిస్థాన్‌లు అంతరిక్షంలో కలిసి పనిచేస్తున్నట్లు బెంగళూరుకు చెందిన దిగంతర సంస్థ నివేదిక వెల్లడించింది. ఉపగ్రహాల ద్వారా భారత సైనిక స్థావరాలు, సరిహద్దులు, వైమానిక, నౌకాదళ కేంద్రాలను పరిశీలించే సామర్థ్యాన్ని ఈ రెండు దేశాలు పంచుకుంటున్నాయని తెలిపింది. 2025లో జరిగిన ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో చైనాకు చెందిన యావోగాన్‌-41 ఉపగ్రహం భారత వైమానిక స్థావరాలను పరిశీలించి ఉండవచ్చని నివేదిక పేర్కొంది.

2025 జనవరి నుంచి 2026 జూన్‌ మధ్య పాకిస్థాన్‌ ప్రయోగించిన ఆరు ఉపగ్రహాల్లో ఐదింటిని చైనా రాకెట్ల సాయంతో నింగిలోకి పంపింది. చైనా ఉపగ్రహాల నిఘాలో ఏర్పడే ఖాళీలను పాక్‌ ఉపగ్రహాలు భర్తీ చేసేలా కక్ష్యలను రూపొందించినట్లు నివేదిక తెలిపింది. చైనా సహకారంతో పాకిస్థాన్‌లో అంతరిక్ష వస్తువులను పరిశీలించే కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సమాచారాన్ని బీజింగ్‌కు పంపుతున్నారు. 2018 నుంచే చైనా పాక్‌కు ఉపగ్రహ ప్రయోగాల్లో సహకరిస్తున్నది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్‌ తన స్వతంత్ర అంతరిక్ష నిఘా సామర్థ్యాలను మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని నివేదిక సూచించింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events