Skip to main content

Namaste NRI

ఈ సినిమా అందరి హృదయాలను హత్తుకుంటుంది: నిర్మాత దీపక్‌

వెన్నెల సిల్వర్ స్క్రీన్ బ్యానర్ మీద దీపక్ నిర్మాతగా శరత్ తెరకెక్కించిన చిత్రం డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్. రజత్ రాఘవ్, కాజల్, హాసిని సుధీర్ హీరో, హీరోయిన్లు గా బేబీ పరిణిత రుద్రరాజు ముఖ్య ముఖ్య పాత్రలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ ప్రీరిలీజ్‌ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకలో జెమిని సురేష్‌ మాట్లాడుతూ ఈ సినిమాలో ఫాదర్‌గా చాలా మంచి పాత్ర చేశాను. ఫాదర్‌ అండ్‌ డాటర్‌ ఎమోషన్‌ అందరి హృదయాలకు హత్తుకుంటుంది అని అన్నారు. నిర్మాత దీపక్‌ అవుట్‌పుట్‌ పట్ల ఎంతో నమ్మకంగా ఉన్నారు. తప్పకుండా ఈ చిత్రం అందరికి నచ్చుతుంది. ఈ చిత్రంలోని ఎమోషన్‌ అందర్ని భావోద్వేగానికి గురిచేస్తుంది అని దర్శకుడు శరత్ చెప్పారు.

నిర్మాత దీపక్ మాట్లాడుతూ ఈ సినిమా ఎంటర్‌టైన్‌ మెంట్‌, ఎమోషనల్‌గా ఉంటుంది. రియల్‌ లవ్‌ ఏమిటో ఈ సినిమాలో ఉంటుంది. హీరో రజత్‌ ఎఫర్ట్‌కి తగ్గ ఫలితం ఈ సినిమాతో వస్తుంది. తప్పకుండా ఈ సినిమా నిర్మాతగా నాకెంతో గుర్తింపు తెస్తుంది అని తెలిపారు. ప్రతి ఒక్కరూ జీవితంలో ఎదో ఒక తప్పు చేస్తుంటారు. అయితే ఆ తప్పును సరిదిద్దుకుని జీవితంలో ముందుకు సాగినవాడే కంప్లీట్ మ్యాన్‌. ఈ విషయాన్నే దర్శకుడు ఈ సినిమా ద్వారా ద్వారా చెప్పాలని ప్రయత్నించాడు అని హీరో రజత్‌ రాఘవ్‌ చెప్పారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events