నితేశ్ తివారీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం రామాయణ. ప్రపంచ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన ఈ సినిమా మరో ఘనతను సొంతం చేసుకుంది. ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు పోటీలోఈ సినిమా ముందడుగు వేసింది. విజువల్ ఎఫెక్ట్స్ విభాగానికి సంబంధించి టాప్-20 జాబితాలో చోటు దక్కించుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ధీంతో ది ఒడిస్సీ, డ్యూన్: పార్ట్ 3, అవెంజర్స్: డూమ్స్‌డే వంటి హాలీవుడ్ చిత్రాలతో తదుపరి రౌండ్లో ఈ సినిమా పోటీ పడనుంది. డిసెంబర్ 15న టాప్-10 జాబితాను ప్రకటించనున్నారు. కాగా, చిత్ర నిర్మాత నమిత్ మల్హోత్రాకు చెందిన డిఎస్ఇజి సంస్థ ఈ సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్ సమకూర్చింది. ఈ సంస్థ ఇప్పటివరకూ 8 ఆస్కార్ పురస్కారాలు పొందండం విశేషం.















