అంతరిక్ష పరిశోధనల్లో పాకిస్థాన్ చారిత్రక మైలురాయిని అందుకుంది. తొలిసారిగా ఒక వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపింది. బుధవారం ఉదయం 5.48 గంటలకు చైనా జియుక్వాన్ ప్రయోగ కేంద్రం నుంచి లాంగ్ మార్చ్ 2ఎఫ్ రాకెట్‌ను విజయవంతంగా నింగిలోకి పంపించింది. అందులో పాక్ వైమానిక దళానికి చెందిన మహమ్మద్ జీషాన్ అలీ ఇద్దరు చైనా వ్యోమగాములతో కలిసి టియాంగాంగ్ స్పేస్ స్టేషన్‌కు చేరుకున్నారు. దీంతో పాకిస్థాన్ మానవ సహిత అంతరిక్ష యాత్ర కల సాకారమైంది.

ఈ మిషన్‌లో జీషాన్ అలీతో పాటు చైనా వ్యోమగాములు టాంగ్ హాంగ్‌బో, వు యి ఉన్నారు. వీరు టియాంగాంగ్ అంతరిక్ష కేంద్రంలో సుమారు వారం రోజుల పాటు గడపనున్నారు. అక్కడ సూక్ష్మ గురుత్వాకర్షణ పరిస్థితుల్లో శాస్త్రీయ ప్రయోగాలు చేయడంతో పాటు విద్యార్థులు, ప్రజలకు అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన కల్పించే కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. భూమికి వందల కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమించే అంతరిక్ష కేంద్రంలో నివసిస్తూ పరిశోధనలు చేయడం ఈ మిషన్ ప్రత్యేకత.















