స్పేస్ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా సంచలన ప్రకటన చేశారు. అమెరికాలోని ప్రతి చిన్నారికి రెండు స్పేస్ఎక్స్ షేర్లు అందిస్తామని ఆయన వెల్లడించారు. రెండు షేర్లలో ఒకటి కంపెనీ తరఫున, మరొకటి తాను తన వ్యక్తిగతంగా అందిస్తామని స్పష్టంచేశారు. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న ప్రతి ట్రంప్ అకౌంట్’కు కంపెనీ కొత్తగా ఒక క్లాస్ ఏ కామన్ స్టాక్ షేర్‌ను కేటాయిస్తుంది. దీనికి సమానంగా మస్క్ కూడా వ్యక్తిగతంగా మరో షేర్‌ను జోడిస్తారు.

అయితే మస్క్ వ్యక్తిగతంగా ఇచ్చే షేర్లకు కూడా ట్రంప్ అకౌంట్లతో సంబంధం ఉంటుందా? లేదా వాటికి ఏవైనా లాకప్ పీరియడ్ నిబంధనలు వర్తిస్తాయా? అనే దానిపై స్పేస్ఎక్స్ స్పందించాల్సి ఉంది. గత నెలలో కూడా మస్క్ ఇలాంటి ప్రకటనే చేశారు. వచ్చే ఏడాది అమెరికాలోని ప్రతి చిన్నారికి తన స్పేస్ఎక్స్ షేర్లలో ఒకటి ఇస్తానని చెప్పారు. అంతకుముందు అక్టోబర్‌లో స్పేస్ఎక్స్ ప్రెసిడెంట్ గ్విన్ షాట్వెల్, ఆమె భర్త కూడా ట్రంప్ కార్యక్రమం కింద 2 మిలియన్లకు పైగా పిల్లలకు తమ స్పేస్ఎక్స్ షేర్లను ఇస్తామని హామీ ఇచ్చారు.















