తన కన్సల్టెంగ్ విభాగంలోని చాలా ఉద్యోగాలకు యూఎస్ వర్క్ వీసాలు, గ్రీన్‌కార్డులను స్పాన్సర్ చేయడాన్ని నిలిపివేయాలని టెక్ దిగ్గజం ఐబీఎం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విభాగంలో 1,50,000 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రభావితమైన ఉద్యోగులు ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి మరో దేశానికి తరలి వెళ్లవచ్చు, లేదా కంపెనీని విడిచిపెట్టవచ్చు.

ఐబీఎం నిర్ణయంతో వేలాదిమంది భారతీయ నిపుణులు అనిశ్చితిని ఎదుర్కోవచ్చునని భావిస్తున్నారు. ప్రభావితమైన ఉద్యోగులు అమెరికా కాకుండా ఇతర దేశాల్లో పనిచేయాలని, లేకపోతే దేశాన్ని వదిలిపెట్టి వెళ్లాలని ఐబీఎం వారిని కోరింది. ఐబీఎం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా ఎంతమంది ఉద్యోగులు ప్రభావితమవుతున్నారు, ఈ నిర్ణయం హెచ్1బీ వీసా కలిగి ఉన్నవారిపై, గ్రీన్‌కార్డు కోసం వేచి చూస్తున్న ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడనుంది.















