Skip to main content

Namaste NRI

దేశభక్తి నేపథ్యంలో మిసెస్ కల్నల్ .. టీజర్ విడుదల

ప్రియా హెగ్డే, చిరాగ్‌ జానీ, మాన్య గౌడ, మహేశ్‌ విట్టా, టెంపర్‌ వంశీ, సాహితీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మిసెస్‌ కల్నల్‌. శ్రీకరం ప్రభాకర్‌ దర్శకుడు. సాయికృష్ణ నిర్మాత. ప్రస్తుతం సినిమా నిర్మాణ దశలో ఉన్నది. ఈ సినిమా టీజర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. అన్ని వర్గాలకూ నచ్చే విభిన్నమైన అంశాలు ఈ సినిమాలో ఉంటాయని దర్శకుడు శ్రీకరం ప్రభాకర్‌ చెప్పారు.

ఈ సినిమాలో భాగం కావడం పట్ల నటీనటులందరూ ఆనందం వెలిబుచ్చారు. సినిమా బాగా వచ్చిందని, నిర్మాతగా ఓ మంచి సినిమా నిర్మించానన్న సంతృప్తిని ఈ సినిమా ఇచ్చిందని నిర్మాత సాయికృష్ణ తెలిపారు. హీరో చిరాగ్ జానీ మాట్లాడుతూ.. దేశభక్తి నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో హీరోగా నటించడం తన కెరీర్‌లో ఎంతో ప్రత్యేకమని, అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలని పేర్కొన్నారు.ఇంకా ఎడిటర్‌ కార్తికేయన్‌ కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: కార్తిక్‌ కొప్పెర, సంగీతం: సునీల్‌ కశ్యప్‌, సమర్పణ: విలోక్‌, కౌశిక్‌, నిర్మాణం: ఆది క్రియేషన్స్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events